తిరుమల లడ్డు : మనుషుల్ని మోసం చేయొచ్చు, మానవ అతీతమైన దైవాన్ని మోసం చేయలేము ttd ex చైర్మన్ కరుణాకర్ రెడ్డి | sahaya news |
తిరుమల లడ్డు : మనుషుల్ని మోసం చేయొచ్చు, మానవ అతీతమైన దైవాన్ని మోసం చేయలేము ttd ex చైర్మన్ కరుణాకర్ రెడ్డి | sahaya news |
మనుషుల్ని మోసం చేయగలం. మానవ అతీతుల్ని మోసం చేయలేము అంటూ.. (TTD)తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. (Tirumala Laddu)తిరుమల లడ్డూ విషయం పై సుప్రేంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఆయన మీడియా తో మాట్లాడారు. ధర్మాగ్రహాన్ని గుర్తించి ధర్మాసనం దైవం మానుస రూపంలో సత్యాన్ని ముందుంచింది అని తెలిపారు. పదవి వుందని పెదవి జారితే, మహా ప్రసాదాన్ని మాటలతో మలినం చేస్తే, అపద్ధాన్ని నిజం చేయటం కోసం స్వ పక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడం భక్త, ప్రజా, దేశ, దైవ ద్రోహం చేసినట్లుగా కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
స్వామి ప్రసాదం (Tirumala Laddu)లడ్డూ పై దుర్మార్గ ప్రచారం ఎంతగా ప్రపంచాన్ని కలచి వేసింది. హిందూ సమాజాన్ని ఎంతో బాదించింది. రాజీవ నేత్రుని రాజకీయాల్లోకి తీసుకురావటం, విశ్వరూప శక్తిని వివాదాల్లోకి తీసుకురావడం ఎంతో బాధపడే విషయమని తెలిపారు.
ఇంత అన్యాయానికి ప్రభుత్వం దిగజారటం, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా వుండి నాటు
సారా తాగిన వ్యక్తి నడిరోడ్డులో ప్రేలాపన చేసేలా స్వామి ప్రసాదం (Tirumala Laddu) పై కలుషిత మాటల
తీరు పై ధర్మాసనం సరిగ్గా స్పందించినట్లు అయన తెలిపారు. ఇంకా వాస్తవాలు బయటకు
రావాలని అన్నారు.
(TTD)తిరుమల తిరుపతి దేవస్థానాల ఇవో ఓ ప్రకటన చేస్తే దానికి విరుద్ధమైన సీయం చేయటం ఇక్కడ గమనార్హమని తెలిపారు. గత వైసిపీ ప్రభుత్వంలో లడ్డూ
(Tirumala Laddu) కల్తీ జరిగిందని విష ప్రచారం చేసారు.
సీయం అలా (TTD)దేవస్థాన ఇవో ప్రకటనకే విరుద్ధంగా బహిరంగ ప్రకటన చేసాక ఇప్పుడు అయన ఏర్పాటు చేసిన సిట్ ఎ విధమైన నివేదిక ఇవ్వగలదో అర్థం చేసుకోవచ్చని కరుణాకర్ రెడ్డి సిట్ దర్యాప్తు పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రి, అయన అనునాయులు, ఆయనకు
వత్తాసుపలికే ప్రసార మాధ్యమాలు వేల కోట్ల
భక్తుల మనోభావాలకు భంగం కలుగుతాయనే ఆలోచనే లేకుండా
(Tirumala Laddu) తిరుమల లడ్డు విషయంలో నిర్వర్తించిన తీరును ప్రజలు చూసారని పేర్కొన్నారు. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. మేము తప్పు చేసి వుంటే ఎ శిక్షకైనా సిద్దమని తెలిపాము. ప్రమాణం కూడా చేసాము.
కనీసం విచారణ లేకుండానే వైసీపీని ప్రజల్లో
చులకన చేయాలనే చంద్రబాబు
ప్రచారానికి జవాబు గా, ఆ దైవమే తిరుమల లడ్డు అంశం పై సుప్రీం కోర్టులో పలికించిన మాటలుగా మేము భావిస్తున్నాము. మేము తప్పు చేయలేదు. అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి అని ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రచారానికి జవాబు గా, ఆ దైవమే తిరుమల లడ్డు అంశం పై సుప్రీం కోర్టులో పలికించిన మాటలుగా మేము భావిస్తున్నాము. మేము తప్పు చేయలేదు. అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి అని ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్త వీడియో కోసం ఆంగ్లములోని video అక్షరములపై క్లిక్ చేయండి : Video
కామెంట్‌లు