ఆహారం పేదలకు పంపిణీ : నేస్తం సేవా సంస్థ || sahayanewsap ||
ఆహారం పేదలకు పంపిణీ : నేస్తం సేవా సంస్థ || sahayanewsap |||
|| మైదుకూరు || MYDUKUR || : ఆహారం వృధా కానివ్వం మరో కడుపు నింపుతాం
వినాయక చవితి పండుగ సందర్భంగా మిగిలిన ఆహారం పేదలకు పంపిణీ
సహాయన్యూస్ : అన్నం పర బ్రహ్మ స్వరూపం. ఈ పధం విలువ మహోన్నతమైనది. ఆకలితో అలమటించే పేదవారికి పూట కడుపు నింపటం ఫున్య ఫల దాయకం. ఇటీవల కాలంలో వివాహాలు, దైవ కార్యక్రమాలు నిర్వహణలో అనుకున్న సంఖ్యలో అతిధులు, హాజరయ్యేవారు హాజరు కాకపోవతంతో వారి కోసం ఏర్పాటు చేసిన భోజన మిగిలిపోతోంది. ఇలా మిగిలిన ఆహార విషయ సమాచారం తెలియగానే కొన్ని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఆ ఆహార పదార్థాలను సేకరించి నిరుపేదలు, నిరాశ్రయులకు ఆకలిగొన్న వారికి అందిస్తున్నారు. ఈ విధమైన సేవ మైదుకూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తుండటం గమనార్హం. ఏమైనా ఆకలి గొన్న వారికి అన్నం కడుపు నింపే ఈ స్వచ్చంద సంస్థలు ప్రతినిధుల, మిగిలిన ఆహారాన్ని పేదలకు పంచుదాం అనే ఆలోచన వచ్చే వారి హృదయ గొప్పతనం అమూల్యమైనది.
మైదుకూరు పట్టణం లో వినాయక చవితి పండుగ సందర్భంగా ఆహారం మిగిలిపోవడంతో నేస్తం సేవా సంస్థకు సమాచారం ఇవ్వడంతో సభ్యులు శనివారం రాత్రి అక్కడికి వెళ్లి కలర్ రైస్,మసృమ్ కరి,పెరుగు చెట్నీ సేకరించి తీసుకెళ్లి పేదలకు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో, కోగటం కొండారెడ్డి, వన్నేం పల్లె ఉపేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు