NH-67 రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు (మైదుకూరు)
NH-67 రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు
*దాదాపు 20 గ్రామాల రాకపోకలు మార్గం పట్ల NH-67 రోడ్డు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం
*అండర్ ప్రాసెస్ కొలతలు పెంచి నిర్మించకపొతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిక
*అండర్ ప్రాసెస్ మా భవిష్యత్ ఆదారపడి ఉందన్న 20 గ్రామాల రైతాంగము,ప్రజలు.
సహాయ న్యూస్ : మునిసిపాలిటి పరిది లోని స్వరాయపల్లి రోడ్డు నూతనంగా నిర్మాణము చేయు NH-67 మార్గము పనులను ప్రజలు, రైతులు చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ NH-67 రోడ్డు నిర్మాణ సంస్థ దాదాపు 20 గ్రామాల రాకపోకలు మార్గం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తక్కువ కొలతలతో అండర్ ప్రాసెస్ నిర్మాణము చేస్తూ ఉంటె అడ్డుకుని,అలాగే రాకపోకలను అడ్డుకున్నారు.ఈ మార్గము గుండా నిత్యము మైదుకూరు కు రాకపోకలు చేయుచున్నాము.ఈ మార్గము నుండి దాదాపు 20 గ్రామాల ప్రజానీకము, అలాగే ఈ రోడ్డు గుండా కమలాపురము వరకు ప్రయాణము చేస్తున్నాము. ఇంత తక్కువ కొలతలతో అండర్ ప్రాసెస్ నిర్మాణము మాకు రాక పోకలు ఇబ్బందిగా ఉంటుందని మా గ్రామాల ప్రజలు తీర్వ ఇబ్బంది కలుగుతుంది. నిత్యము స్కూల్ బస్సులు,ఎద్దుల బండ్లు,ట్రాక్టర్లు,వ్యవసాయదరిత యంత్రాలు ఈ మార్గము లో నిత్యమూ రాకపోకలు జరుగుతున్నాయి వీరంతా ఇబ్బందులకు గురవ్వుతామని వారు అన్నారు. అండర్ ప్రాసెస్ నిర్మాణము కొలతలు పెంచి నిర్మిస్తే మా గ్రామాలకు సౌకర్యంగా ఉంటుంది. లేనియెడల జాతీయ రహదారికి ఉన్నటువంటి వాహనాల వేగము, ఒత్తిడి మా రహదారిపై పడి మా రహదారి గుండా నిత్యమూ గుండా నిత్యమూ ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు, మోటారు బైకులు, వ్యవసాయదారిత వాహనాలు, పాడిపశుసంపద, స్కూల్ బస్సులు, స్కూల్ విద్యార్థులు,ముగ జీవాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం స్పష్టంగా ఎక్కువగా ఉన్నని ఈ అండర్ ప్రాసెస్ నిర్మాణము కొలతలు పెంచి నిర్మించాక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమములో యపల్లి,బి.కొత్తపల్లె,బక్కయపల్లి,తిప్పాయపల్లి,శ్రినివాసపురము,శాంతినగరముతదితర గ్రామాల ప్రజానీకము, రైతులు పాల్గొన్నారు.

కామెంట్‌లు