kadapa - mydukur – మైదుకూరు పట్టణంలో ప్రమాదకరంగా గోతులతో పాతబడ్డ వంతెన (bridge) || sahayanews ||
kadapa - mydukur – మైదుకూరు పట్టణంలో ప్రమాదకరంగా గోతులతో పాతబడ్డ వంతెన (bridge)
|| sahayanews ||
sahayanews : మైదుకూరు(MYDUKUR) పట్టణం పోరుమామిళ్ల రహదారిలోని, విజయ్ సినిమా హాలు చేరువలో కేసీ కాలువపై నిర్మించిన వంతెన(bridge) పాతబడిపొయింది. వంతెనపై పెద్దపాటి గోతులు ఏర్పడ్డాయి. ఈ వంతెన(bridge) మీదుగా నిత్యం మైదుకూరు(mydukur) పట్టణం నుంచి పోరుమామిళ్ల, గిద్దలూరు, మార్కాపురం, శ్రీశైలం పట్టణాలకు వందలాదిగా, వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. వంతెనపై(bridge) ఏర్పడిన ప్రమాదకర పెద్ధపాటి గోతుల వల్ల, ప్రమాదం చోటుచేసుకుంటుంది అనే ఆందోళనను వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. (bridge)వంతెనపై ప్రయాణ సమయంలో వాహనాలు తప్పుకునే సంధర్బంలో, ఈ పెద్దపాటి గోతుల వల్ల తాము అవస్థలు పడుతున్నామని, ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు రవాణాశాఖ అధికారులు పాడుబడ్డ పాత (bridge)వంతెన స్థానంలో, నూతన వంతెన ఏర్పాటు చర్యలతో పాటు, ముందస్తుగా వంతెన పై ఏర్పడ్డ గోతులను లేకుండా మరమ్మతు చర్యలు, చేపట్టాలని వాహన దారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
కామెంట్‌లు