KADAPA DISTRICT NEWS : కడప జిల్లా రైతులు సమస్యలను పరిష్కరించాలి. |Rythu Seva Samithi | Farmers | sahaya news |

 

KADAPA DISTRICT NEWS : కడప జిల్లా రైతులు సమస్యలను పరిష్కరించాలి. |Rythu Seva Samithi | Farmers | sahaya news |


KADAPA DISTRICT NEWS : కడప జిల్లా రైతులు సమస్యలను పరిష్కరించాలి. |Rythu Seva Samithi | Farmers | sahaya news |


కడప జిల్లాలో రైతులు (Farmers)ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సోమవారం ప్రజా సమస్యల వేదక కార్యక్రమం సందర్భంగా, కడప జిల్లా రెవిన్యూ అధికారికి వినతి పత్రం ద్వారా రైతు సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎ వి రమణ, కొవ్వూరు మస్తాన్ రావు,  జిల్లా సమితి సభ్యులు కోరారు. జిల్లాలోని సాగునీటి చెరువుల్లో ప్రతి చెరువు ముప్పై శాతం మేర భూఆక్రమనకు గురి కావడంతో, చెరువులలో పూర్తిస్థాయిలో నీటిని నింపే అవకాశం లేకుండా పోతున్నదని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెరువుల ఆక్రమణలను, తొలగించే చర్యలను అధికారులు చేపట్టాలని కోరారు. 

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత ఎన్నికల ప్రచారములో (Farmers) రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తానని తెలిపారని, ఆ హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు.  జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టులను, పూర్తి చేసే చర్యలు చేపట్టాలని కోరారు.  శంకుస్థాపనలకే పరిమితమైన రాజోలి,  జొలధరాశి ప్రాజెక్టుల నిర్మాణ పనులు మొదలుపెట్టె చర్యలు ప్రభుత్వం చేపట్టని తెలిపారు.

జిల్లాలో సరైన అదునులో వర్షాలు లేక పంటసాగు ఆలస్యమైనదని, ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించుకుని (Farmers) రైతులకు, పంటసాగు ఈ క్రాప్ గడువు తేదీని, సెప్టంబర్ పదవ తేదీకి పెంచాలని కోరారు.  తెలుగుగంగ పథకంలోని రిజర్వయరులలో నీరున్నా, పంట కాలువలు సక్రంమంగా లేక పోవడంతో, రైతులు(Farmers)  సాగునీటి కష్టాలు పడుతున్నారని, పంటకాలవల ఏర్పాటు పై పరిశీలన చేసి, సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. 

రైతుల(Farmers)  సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే రైతు సేవా సమితి తరపున దశల వారిగా, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని జిల్లా రెవిన్యూ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో(Farmers)  రైతు సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎ వి రమణ, కొవ్వూరు మస్తాన్ రావు,  జిల్లా సమితి సభ్యులు కోటయ్య గారి మురళి, అక్కి దాసరి రమేష్, మూలే రామాంజనేయరెడ్డి, స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ శివారెడ్డి తదితర రైతులు(Farmers)  పాల్గొన్నారు.

సహాయన్యూస్ వార్త వీడియోను  క్లిక్ చేయడం ద్వారా వీక్షించండి. Video(click this)  సహాయన్యూస్ చానల్ సబ్స్క్రయిబ్ చేయండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KADAPA ZP CHAIRMAN : కారుణ్య నియామకాల పత్రాలను అందజేసిన జెడ్పీ చైర్మన్ MUTYALA RAMA GOVINDA REDDY

Early Life of PM Narendra Modi - (Birth to 15 Years) APSAHAYANEWS

AP New Ration Card - ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రజలకు GOOD NEWS : రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న New Ration Card దరఖాస్తు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్