స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన కడప జిల్లా ఎస్పీ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన కడప జిల్లా ఎస్పీ
• ముస్తాబు అవుతున్న పోలీసు పెరేడ్ గ్రౌండ్. • ఏర్పాట్ల ను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ గారు
సహాయన్యూస్ (ఆగష్టు 12) : ఆగస్టు 15(గురువారం) న ఘనంగా జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పోలీసుల కవాతు రిహార్సల్స్ ను కడప నగరంలోని జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించారు. పెరేడ్ రిహార్సల్ లో భాగంగా జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతు రిహార్సల్స్ ను జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు గారు పరిశీలించారు. కవాతు పరిశీలన వాహనంలో జిల్లా ఎస్పీ గారు వెళ్ళి పోలీసుల, మరియు హోంగార్డ్స్ తో పాటు ఎన్.సి.సి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల కవాతును పరిశీలించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజలకు గ్యాలరీల ఏర్పాటు, కల్పించాల్సిన భద్రత ఏర్పాట్లను, సౌకర్యాల గురించి సమీక్షించి జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్ శ్రీ ఎస్.ఎస్.వి కృష్ణారావు , ఆర్.ఐ లు ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.




కామెంట్‌లు