మైదుకూరు లో దేశభక్తిని చాటిన యువత
మైదుకూరు లో దేశభక్తిని చాటిన యువత
మైదుకూరు
లో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ
హర్ గర్
తిరంగ 77వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా
సహాయన్యూస్, ఆగస్టు 13 : భారతీయ జనతా పార్టీ బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగ నినాదంతో జాతీయ జెండాలను పట్టుకొని దేశభక్తితో ముందుకు సాగారు మైదుకూరు యువత. భారతజాతి గర్వించదగ్గ స్వతంత్ర వీరులను స్మరించుకుంటూ, మైదుకూరు లోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా శ్రీకృష్ణదేవరాల సర్కిల్ నుండి మార్కెట్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా నియాజకవర్గ ఇన్చార్జ్ మాచనూరు సుబ్బరాయుడు మాట్లాడుతూ, దేశంలో యువత ఐక్యమత్యభావనతో మెలగాలని, దేశ సేవలో అందరూ భాగస్వామ్యం పొంది దేశ పౌరునిగా సమాజంలో జరుగుతున్న విచ్చిన్నమైన శక్తులను ఎదుర్కొని నిలబడాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని, ఆయన సేవలు మరువలేనివని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో వీర మరణం పొందిన అనేక మందిని మనం స్మరించుకోవాలని, యువత దేశం వైపు అడుగులు వేయాలని సుబ్బరాయుడు కోరారు. కార్యక్రమంలో మైదుకూరు ప్రవేట్ స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పార్టీలకతీతంగా అందరూ ఒకటిగా పాల్గొని దేశభక్తిని చాటడం జరిగింది.


కామెంట్‌లు