సాగునీటి పారుదలపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలన
సాగునీటి పారుదలపై
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలన
నీటిపారుదల
తీరు పై ఎమ్మెల్యే చొరవ పట్ల రైతుల్లో సానుకూలత
సహాయన్యూస్,
ఆగస్టు 13 : మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో
సాగునీటి వనరులు వాటి తీరు తెన్నులపై దృష్టిపెట్టారు. మంగళవారం ఆయన నీటిపారుదల శాఖ
అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ఎస్సార్ 1 నుంచి ఎస్సార్ 2 రిజర్వాయర్
కు నీటి చేరిక, అలాగే చింతకుంట చెరువుకుకు వెళ్ళే నీటి పరిశీలన, లింగాలదిన్నె
చెరువుకు నీటి ప్రవాహ కాలువలను పరిశీలించారు. నీటి పారుదల పై స్థానిక రైతులతో కలసి
మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి తగ్గ చర్యలు
తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నీటి పారుదల పై ఎమ్మెల్యే ప్రధాన ద్రుష్టి : మైదుకూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కే.సీ ఆయకట్టు, తెలుగుగంగ, చెరువులు, బోర్లు ఇక్కడ సేద్యానికి ప్రధాన నీటివనరులు. ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత మొదటగా కే.సీ ఆయకట్టుకు రాజోలి ద్వారా సాగునీటిని విడుదల చేసారు. తర్వాత తెలుగు గంగ పథకం ఎస్సార్ 1కి చేరిన కృష్ణా జలాలను ఎస్సార్ 2 విడుదల చేయటంతో పాటు ఇప్పుడు సంబందిత సాగునీరు చెరువులకు కుడా చేరేల చర్యలు చేపడుతున్నారు. చెరువుల్లో నీటి చేరిక వల్ల మైదుకూరు మండలంలో భూగర్భ జలాలు మెండుగా పెరుగుతాయని తద్వారా సేద్యపు బోర్ల ద్వార నీటి లభ్యత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. రైతుల సాగునీటి పారుదలపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చూపెడుతున్న శ్రద్ధ పై రైతుల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది.
Sahaya news 2 youtube channel.
https://youtu.be/pBZchEh4-bo?si=Qc4XhPCB1tbTDmax
సహాయన్యూస్ బ్లాగర్ ను ఫాలో అవండి – సహాయన్యూస్.
కామెంట్‌లు